బంగార్రాజు నుండి నాకోసం లిరికల్ వీడియో విడుదల!

Published on Dec 5, 2021 7:16 pm IST


అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. నాగ చైతన్య, నాగార్జున ఇద్దరూ ఈ చిత్రం లో కలిసి నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి నాకోసం లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అభిమానుల్ని, ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సి, అనిత చౌదరీ, రోహిణి, ప్రవీణ్, పద్మ సూర్య, రంజిత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :