బాలయ్య ‘లయన్‌’తో సిద్దార్థ్ సినిమా..!

Siddharth
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో మెరిసిన సిద్దార్థ్.. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయారు. సిద్దార్థ్ తెలుగులో చేసిన చివరి సినిమా.. ‘జబర్దస్త్’. ఆ సినిమా పరాజయం తర్వాత సిద్ధూ తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు. అయితే ఈ సమయంలో తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోయారు. ‘జిగర్ తండా’, ‘కావ్య తలైవన్’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఇందులో ‘జిగర్‌తండా’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలు తెలుగులో ‘దిల్‌రాజు’, ‘నాలోఒకడు’ పేర్లతో విడుదల కానున్న విషయం తెలిసిందే!

ఈ మధ్యే ‘నాలో ఒకడు’ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో సిద్ధార్థ్, ‘త్వరలోనే తెలుగులో మళ్ళీ కనిపిస్తా. నన్ను హీరోను చేసిందే తెలుగు సినిమా’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తాజాగా ఈ సినిమాను మే 1న మేడే కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ నటనకు, గెటప్‌కు తమిళనాట మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని సిద్ధార్థ్ ధీమాగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. మే 1నే ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య నటించిన ‘లయన్’ విడుదల కానుండడం విశేషం. అదేరోజు కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’, లారెన్స్ ‘గంగ’ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

Exit mobile version