సెన్సార్ పూర్తి చేసుకున్న నభా నటేష్ “డార్లింగ్”

సెన్సార్ పూర్తి చేసుకున్న నభా నటేష్ “డార్లింగ్”

Published on Jul 11, 2024 10:58 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్నా ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ట్రైలర్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ని ప్రామిస్ చేసిన లేటెస్ట్ చిత్రం “డార్లింగ్” అని చెప్పాలి. యంగ్ నటుడు ప్రియదర్శి అలాగే యంగ్ హీరోయిన్ నభా నటేష్ నటించిన ఈ చిత్రం ఆడియెన్స్ లో అయితే మంచి బజ్ ని రేకెత్తించింది. ఇక ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా మేకర్స్ అన్ని పనులు పూర్తి చేసేస్తున్నారు.

మరి అలా సినిమా వారం ముందే సెన్సార్ ని కూడా ముగించేశారు. మరి దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. దీనితో మేకర్స్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని ఈ మ్యాడ్ మాక్స్ మ్యారేజ్ డ్రామా అందిస్తుంది అని ప్రామిస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు అలాగే ఈ జూలై 19న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు