ఎంటర్టైనింగ్ గా నభా నటేష్, ప్రియదర్శిల “డార్లింగ్” ట్రైలర్

ఎంటర్టైనింగ్ గా నభా నటేష్, ప్రియదర్శిల “డార్లింగ్” ట్రైలర్

Published on Jul 7, 2024 1:13 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి మెయిన్ లీడ్ లో కూడా పలు చిత్రాలు చేస్తున్నాడు. సెన్సేషనల్ హిట్ చిత్రం “బలగం” తర్వాత మరిన్ని మంచి సినిమాలు చేస్తూ వస్తున్నా ఈ యంగ్ హీరో అలాగే యంగ్ హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “డార్లింగ్”.

మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే నభా నటేష్ రోల్ పై ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఆమె సైడ్ నుంచే సినిమాలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని తాజా ట్రైలర్ లో చూస్తే అర్ధం అయిపోతుంది.

అపరిచితుడు తరహాలో ఒకే మనిషిలో మరికొన్ని పర్సనాలిస్ ఉంటే ఆ మనిషి అమ్మాయి అయ్యి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని భార్యతో పారిస్ వెళ్ళాలి అని కోరుకుంటున్న యువకుడుకి తగిలితే ఎలా ఉంటుంది అనే ఫన్ లైన్ తో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని మేకర్స్ ఈ ట్రైలర్ తో ప్రామిస్ చేస్తున్నారు.

మరి ఈ ట్రైలర్ లో నభా అయితే అదరగొట్టేసింది అని చెప్పాలి. అలాగే ప్రియదర్శి కూడా తన మార్క్ టైమింగ్ లో కనిపిస్తున్నాడు. ఇంకా ట్రైలర్ లో వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా బాగుంది. మరి ఈ ఎంటర్టైనర్ ని “హను మాన్” నిర్మాతలు నిర్మాణం వహించగా ఈ జూలై 19న సినిమా రిలీజ్ కి రాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు