“విరూపాక్ష” నుండి ఆకట్టుకుంటున్న నచ్చావులే నచ్చావులే సాంగ్

Published on Mar 24, 2023 8:30 pm IST

మెగా హీరో హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్తా మీనన్ హీరోయిన్ గా డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రం ను ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి నచ్చావులే నచ్చావులే అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పాట ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థల పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :