గని లో మాధురి గా నదియా!

గని లో మాధురి గా నదియా!

Published on Nov 12, 2021 2:55 PM IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ పతాకాల పై ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఒక్ వీడియో ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో నదియా నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు చిత్ర యూనిట్. పలు పాత్రలకి సంబంధించిన వీడియో ను వరల్డ్ ఆఫ్ గని పేరిట విడుదల చేయడం జరిగింది. నేడు తాజాగా చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్రం లో నదియా మాధురి పాత్ర లో నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు