
‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన దర్శకుడు సుధీర్ వర్మ. తాజాగా సుధీర్ వర్మ నాగచైతన్యతో ‘దోచేయ్’ పేరుతో మరో సరికొత్త కథతో క్రైమ్ కామెడీ నేపథ్యంలో సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‍గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (ఏప్రిల్ 24న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ చూసినవారంతా ఈ సినిమా హిట్ అయినట్లే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూసిన నాగార్జున సినిమాపై ప్రశంసలు కురిపించారు. “నిన్న రాత్రి దోచేయ్ సినిమా చూశా. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. చివరి 30 నిమిషాలు హిలేరియస్‌గా ఉంది” అంటూ ట్వీట్ చేశారు. ‘దోచేయ్’ సినిమా విషయంలో మొదట్నుంచీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ‘స్వామిరారా’ వంటి హిట్ సినిమా తర్వాత సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా కావడం, చైతూ సరికొత్తగా ఓ క్రైమ్ కామెడీ సినిమాలో కనిపించనుండడం ఈ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించాయి.
Watched DOCHAY last night/very slick and very entertaining…hilarious last 30 minutes/all the best to the DOCHAY team!!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 23, 2015