శ్రీ‌కృష్ణుడిగా మ‌హేశ్ బాబు.. నాగ్ అశ్విన్ మ‌నసులో మాట ఇదే!

శ్రీ‌కృష్ణుడిగా మ‌హేశ్ బాబు.. నాగ్ అశ్విన్ మ‌నసులో మాట ఇదే!

Published on Jul 5, 2024 5:24 PM IST

పాన్ ఇండియా స్థాయిలో ఇండియ‌న్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న ‘క‌ల్కి 2898 AD’ మూవీ స‌క్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తాజాగా మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వారితో పంచుకున్నారు.

ఈ క్ర‌మంలో క‌ల్కి సినిమాలోని మ‌హాభార‌త స‌న్నివేశాల్లో శ్రీ‌కృష్ణుడి పాత్ర‌ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేసుంటే ఇంకా బాగుండేద‌ని సోషల్ మీడియాలో చ‌ర్చిస్తున్నార‌ని.. క‌ల్కి-2లో మ‌హేశ్ శ్రీ‌కృష్ణుడిగా క‌నిపించే అవ‌కాశం ఉందా..? అని ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు.

దీనికి సమాధానంగా ”క‌ల్కి మూవీలో శ్రీ‌కృష్ణుడిని డార్క్ షేడ్‌లో చూపెట్టాల‌ని అనుకున్నాను. ఇక క‌ల్కి-2లోనూ అలాగే ఉంటాడు. అయితే, మ‌హేశ్ బాబు శ్రీ‌కృష్ణుడిగా నిజంగానే బాగుంటాడు. భ‌విష్య‌త్తులో కుదిరితే ఆ పాత్ర‌లో మ‌హేశ్ ను ఖ‌చ్చితంగా చూపెడ‌తాను” అని నాగ్ అశ్విన్ బ‌దులిచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు