ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” పై విషయం లో ఆనంద్ మహీంద్రా ను సాయం కోరిన నాగ్ అశ్విన్

Published on Mar 4, 2022 1:00 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా కాకుండా, పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ చిత్రం ను మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా నాగ్ అశ్విన్ ప్రస్తావిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రియమైన ఆనంద్ మహీంద్రా సర్, మేము బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకునే లతో కలిసి ప్రాజెక్ట్ కే అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాను రూపొందిస్తున్నాము అని అన్నారు.ప్రాజెక్ట్ కే లో మేము ఈ ప్రపంచం కోసం నిర్మిస్తున్న కొన్ని వాహనాలు ఈనాటి సాంకేతిక కు అతీతమైనవి. అది మన దేశానికి గర్వకారణం గా నిలుస్తుంది. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను సర్. మనలో టాలెంట్ ఉంది, మనకు పూర్తిగా ఇండియన్ టీమ్ ఇంజినీర్లు మరియు డిజైనర్లు ఉన్నారు. అయితే ప్రాజెక్ట్ కే మన చేతికి అందేలా ఉంది అని, ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి సినిమాను ప్రయత్నించలేదు అని, మీరు మాకు సహాయం చేయగలిగితే గౌరవం గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :