“కల్కి” విషయంలో నాగ్ అశ్విన్ సెటైరికల్ ఫన్నీ పోస్ట్ వైరల్

“కల్కి” విషయంలో నాగ్ అశ్విన్ సెటైరికల్ ఫన్నీ పోస్ట్ వైరల్

Published on Jul 5, 2024 4:59 PM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా సెలబ్రేట్ చేసుకుంటున్న మరో భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన తొలి చిత్రం “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) అనే చెప్పాలి. మరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం విషయంలో రిలీజ్ అయ్యాక చాలానే హంగామా ఆడియెన్స్ లో నెటిజన్స్ లో నడుస్తుంది.

ఇలా కంటిన్యూ అవుతూ సినిమా వచ్చి వారం అయ్యి రెండో వీకెండ్ లోకి కూడా వచ్చేసింది. అయితే ఈ సమయంలో నాగ్ అశ్విన్ పెట్టిన ఒక ఫన్నీ అండ్ సెటైరికల్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇప్పుడు రెండో వారాంతానికి వచ్చేసాం సో అన్ని భాషలు వారు, అందరి అభిమానులు, ఆడియెన్స్ అంతా కూడా సినిమాపై మీ డిస్కషన్స్, థియరీలు అన్నీ పక్కన పెట్టి వీకెండ్ లో సినిమాని ఎంజాయ్ చేద్దాం.

ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఎప్పుడూ తలుపులు తీసే ఉంటాయి సో ప్రస్తుతానికి ఈ వారాంతంలో కల్కి తో ఇండియన్ సినిమాని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ పోస్ట్ చేసాడు. అయితే ఇది కొంతమందికి అర్ధం అయ్యింది కానీ కొంతమందికి అర్ధం కాలేదు దీనితో ఇలా కూడా ఈ పోస్ట్ మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు