‘సింగీతం శ్రీనివాసరావు’ 62వ సినిమా టైటిల్‌ చెప్పిన నాగ్ అశ్విన్ !

దర్శక మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆఖరి శ్వాస వరకు వెండితెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన ఈ మహాదర్శకుడి నిష్క్రమణతో సినిమా ఇండస్ట్రీ ఓ తరం సహజత్వాన్ని కోల్పోయింది. ఇక ఈ జూన్‌లో విడుదలైన ‘సింగ్ గీతం’ చిత్రాన్ని తన 61వ చిత్రంగా ఆయన రూపొందించారు. 61 చిత్రాలు చేసినప్పటికీ, ఇంకా సినిమా తీయాలనే తపన ఆయనలో ఏమాత్రం తగ్గలేదు. ఆయన తన 62వ చిత్రంగా మరో సినిమా చేయాలనుకున్నారు.

‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల దర్శకుడు, ఆయన శిష్యుడైన నాగ్ అశ్విన్, సింగీతం గారు చేసిన వాట్సాప్ గ్రూప్ చాట్‌లో తన తదుపరి సినిమా టైటిల్‌ను ప్రస్తావించారు: “ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్.” ఈ టైటిల్ తో ఆయన మరో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఐతే, ఈ సినిమా చేసే లోపే దురదృష్టవశాత్తు, ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. కానీ ఆ ఆలోచన మాత్రం మిగిలి ఉంది. ఇక ఇప్పుడు, నాగ్ అశ్విన్ గానీ, మరెవరైనా గానీ దానిని ముందుకు తీసుకెళ్లి, ఆ సినిమా చేస్తారేమో చూడాలి.

Exit mobile version