‘క‌ల్కి-2’లో ఆ ఇద్ద‌రు హీరోలను తీసుకొస్తా : నాగ్ అశ్విన్

‘క‌ల్కి-2’లో ఆ ఇద్ద‌రు హీరోలను తీసుకొస్తా : నాగ్ అశ్విన్

Published on Jul 5, 2024 5:59 PM IST

రెబల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘క‌ల్కి 2898 AD’ మూవీతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయిలో వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు. మైథాల‌జీ, సై ఫై అంశాల‌తో సినిమాను తీసి అంద‌రితో ఔరా అనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయ‌న ఎంచుకున్న పాత్ర‌లు, వాటిని డిజైన్ చేసిన తీరు, వాటి కోసం ఆయ‌న ఎంచుకున్న న‌టీన‌టుల విష‌యంలో ప్ర‌శంస‌లు అందుకున్నారు.

అయితే, ఈ సినిమా రిలీజ్ కు ముందు నుండే క‌ల్కిలో చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక సినిమాలో ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక పదుకొనె, దిశా ప‌టాని ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళ‌వికా నాయ‌ర్ వంటి వారు గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. అయితే, ఈ సినిమాలో నాని కూడా న‌టిస్తున్నాడ‌నే వార్త జోరుగా వినిపించింది. తాజాగా జరిగిన మీడియా ఇంట‌రాక్ష‌న్ లో నాగ్ అశ్విన్ దీనిపై స్పందించాడు.

”నిజానికి ఈ సినిమాలోనే నానితో పాటు మ‌రో హీరో న‌వీన్ పొలిశెట్టిని కూడా తీసుకోవాల‌ని అనుకున్నాను.. కానీ కుద‌ర్లేదు.. క‌ల్కి-2లో ఖ‌చ్చితంగా ఏదో ఒక చోట వారిని చూపెడ‌తాను.” అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు