అఖిల్ కొత్త సినిమా టైటిల్ హింట్ ఇచ్చిన నాగార్జున !


అక్కినేని వారసుడు అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం టైటిల్ విషయం లో అనేక ఊహాగానాలు నెలకొని ఉన్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని నిన్నే విడుదల చేసారు. కానీ సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు. కాగా నాగార్జున కొద్ది సేపటిక్రితమే ఈ చిత్ర టైటిల్ విషయంలో ట్విట్టర్ లో హింట్ ఇచ్చారు.నాగ్, అమల నటించిన నిర్ణయం చిత్రం లోని సూపర్ హిట్ సాంగ్ ‘హలో గురు ప్రేమకోసమే జీవితం’ పదాలలో దాగుందని నాగార్జున తెలిపాడు.

దీనితో అభిమానులు వారికి తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘హలో గురు’ మరియు ‘ప్రేమకోసమే జీవితం’ .. ఈ రెండింటిలో ఏదోఒకటి టైటిల్ అయి ఉంటుందని ఊహిస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఫిల్మ్ ఛాంబర్ లో ‘హలో’ అనే టైటిల్ రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.