అఖిల్ హీరోయిన్ ఆమె కాదంటున్న నాగ్


నాగార్జున రెండవ కుమారుడు అఖిల్ రెండవ చిత్రం ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ మొదలై నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అఖిల్ సరసన నటించే హీరోయిన్ కూడా ఇంకా ఎంపిక చేయక పోవడం విశేషం.

దీనితో అఖిల్ రెండవ చిత్రంలో నటించే హీరోయిన్ పై రకరకాల ఉహాగానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ అఖిల్ తో జోడి కట్టబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నాగార్జున ఖండించారు. అఖిల్ తో నటించే హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. విక్రమ్ కుమార్ దర్శకతం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ని త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.