‘ఆటాడుకుందాం రా’.. చిత్రంలో కనిపించనున్న ‘నాగచైతన్య, అఖిల్’

akkininei-family
చాలా కాలంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న అక్కినేని హీరో సుశాంత్ తాజాగా జి. నాగేశ్వర రెడ్ది దర్శకత్వంలో ఆటాదుకుందాం రా చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ కు సపోర్ట్ గా అక్కినేని హీరోలు ‘అఖిల్, నాగ చైతన్య’లు కనిపించనున్నారు.

అఖిల్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్నాడు. అలాగే నాగ చైతన్య కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ కు జోడీగా సోనం భజ్వా నటిస్తోంది. అలాగే ఇంటెర్వెల్, క్లైమ్యాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది. ‘అనూప్ రూబెన్స్’ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘నాగ సుశీల’ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.