నాగ చైతన్య 22వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

నాగ చైతన్య 22వ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Nov 23, 2022 12:44 AM IST


నాగ చైతన్య కథానాయకుడిగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. నాగచైతన్య కెరీర్ 22వ మూవీగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా మూవీగా రూపొందుతోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు చేస్తుండగా నిన్న ఈ మూవీ యొక్క ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు యూనిట్ సభ్యులు.

పోలీస్ డ్రెస్ లో ఉన్న నాగచైతన్య ని ఇతర పోలీస్ అధికారులు గట్టిగా పట్టుకుని అదుపుచేయడానికి ప్రయత్నిస్తూ తుపాకీ గురి పెట్టిన ఆ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా నేడు నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం 10 గం. 18 ని. లకు ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అనౌన్స్ చేసారు. కాగా అతి త్వరలో ఈమూవీకి సంబంధించి ఇతర అప్ డేట్స్ వరుసగా ఒక్కొక్కటిగా రానున్నాయి. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్న ఈ మూవీకి ఎస్ ఆర్ కతిర్ డీవోపీ గా వర్క్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు