కుబేర: నాగర్జున ఫస్ట్ లుక్ పై చైతూ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కుబేర. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మేకర్స్ ధనుష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మేకర్స్ తాజాగా నాగార్జున పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. నాగార్జున లుక్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హీరో నాగ చైతన్య ఈ లుక్ పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్న లుక్ చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version