చైతుతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా.. పరుశురామ్ మల్టీస్టారర్ ?

Published on Jul 10, 2022 8:54 pm IST

డైరెక్టర్ పరుశురామ్ నాగచైతన్య తో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా పై మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని.. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. హీరో నవీన్ పోలిశెట్టి అయితే ఈ పాత్రలో బాగుంటాడని పరుశురామ్ ఫీల్ అవుతున్నాడట. ప్రస్తుతం పరశురామ్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు.

పరశురామ్ గతంలోనే నాగచైతన్యకి ఓ కథ చెప్పాడు, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడు. మొత్తానికి ఈ కాంబినేషన్ నిజం అయితే మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత సినిమా కాబట్టి.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. మరి నాగచైతన్య కోసం పరుశురామ్ ఎలాంటి కథ రాశాడో చూడాలి.

సంబంధిత సమాచారం :