చైతు, సామ్ లు వారికి సమాధానం ఇచ్చినట్టేగా..

Published on Sep 14, 2021 12:02 pm IST

ప్రస్తుతం అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి నిన్ననే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ట్రైలర్ కి ఒక్క ఇండస్ట్రీ వర్గాల నుంచే కాకుండా మూవీ లవర్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ క్రమంలో ఈ సినిమాకి అక్కినేని కోడలు సమంతా అక్కినేని కూడా రెస్పాన్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

దీనికి కారణం కూడా లేకపోలేదు సమంతా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి పేరు తీసి జస్ట్ ఎస్ అనే అక్షరాన్ని పెట్టుకోవడం ఆసక్తిగా మారింది. దీనితో చైతు సామ్ లు విడిపోతున్నారు అన్న రేంజ్ వరకు అంతా రకరకాల స్టోరీలు అల్లేశారు అంతా. కానీ నిన్నటి సామ్ రిప్లై తో అందరికీ ఒకింత క్లారిటీ రాగా ఇప్పుడు చైతు కూడా సామ్ కి థాంక్స్ చెప్పడంతో వీరు ఇద్దరూ ఆ కొంతమందికి సమాధానం ఇచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :