వైభవంగా నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం!


అక్కినేని హీరో నాగ చైతన్య, సౌతిండియన్ సినిమా స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో పెళ్ళి చేసుకోనున్నట్లు ప్రకటించిన ఈ ప్రేమ జంట నిన్న హైద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన నిశ్చితార్థ వేడుకతో ఒక్కటయ్యారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో అక్కినేని కుటుంబంతో పాటు బంధువులు, సన్నిహితులు పాలుపంచుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ పెయిర్స్‌లో ఒకరుగా పేరున్న ఈ జంట నిశ్చితార్థంతో ఒక్కటవ్వడం అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది. ఇక అదేవిధంగా అక్కినేని నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. ‘ఏ మాయ చేశావే’తో రీల్ లైఫ్‌లో జంటగా కనిపించిన చైతూ, సమంతలు ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ జంటగా మారడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తమ తమ కెరీర్స్‌తో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ, పెళ్ళి పీటలెక్కేది ఎప్పుడన్నది మాత్రం తెలియాలి.