మూవీ ప్రమోషన్లలో మునిగిపోయిన ‘నాగ చైతన్య’!


నాగ చైతన్యా నటించిన చిత్రం ‘యుద్ధం శరణం’ ఈ శుక్రవారం సెప్టెంబర్ 8న రిలీజ్ కానుంది. నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విడుదలకు ఇంకో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. హీరో నాగ చైతన్య స్వయంగా రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఈ టూర్లో భాగంగా చైతన్య ఈరోజు ఉదయమే వైజాగ్ చేరుకున్నారు. అక్కడి చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను కలవనున్నారు. ఈ మూడు రోజులు చైతన్య ఇలాగే ప్రమోషనలతో బిజీగా ఉంటారని తెలుస్తోంది. మరి మెరుగైన ఓపెనింగ్స్ సాధించాలంటే ఆ మాత్రం ప్రచారం చేయాల్సిందిగా మరి. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య స్నేహితుడు ఆర్వి మరిముత్తు డైరెక్ట్ చేయగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.