సమంత మతం మార్పిడిపై క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య !

samantha-naga-chatanya

నాగ చైతన్య, సమంతల ప్రేమ సంగతి కొద్దిరోజులుగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. వారిద్దరి గురించి ఏ చిన్న విషయం బయటికొచ్చిన అది రకరకాలుగా మారి పెద్ద సంచలనమైపోతోంది. తాజాగా వారిద్దరూ వేద పండితుల సమక్షంలో కూర్చొని పూజ నిర్వహించిన ఫోటోలు కొన్ని బయటకొచ్చాయి. దాంతో అందరూ ఇదేదో పెళ్ళికి సంబందించిన పూజా కార్యక్రమంలా ఉందని అన్నారు. చివరికి ఆ పూజ సమంత క్రిస్టియన్ మతం నుండి హిందూ మతంలోకి మారుతూ నిర్వహించిన పూజని ఫిక్స్ చేశారు.

కానీ ఈ విషయంపై నాగ చైతన్య పూర్తి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన మాట్లాడుడుతూ ‘ నేను, సమంత ఖాళీగా ఉండటం వల్ల స్టూడియోకి వెళ్లాం. అక్కడ నాన్నగారు ఏదో పూజ చేస్కుంటూ మమ్మల్ని కూడా కూర్చోమన్నారు. అంతేకాని అదేదో మతం మార్చుకోడానికి చేసిన పూజ కాదు. అయినా నాకు మతంతో పనిలేదు. మనిషి ముఖ్యం’ అంటూ క్లారిటీ ఇచ్చారట.