‘బ్యాచ్ లర్’ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్..డేట్ ఫిక్స్

Published on Oct 6, 2021 10:33 am IST

అక్కినేని యువ హీరో అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కి రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు దసరా కానుకగా రెడీ అవుతుంది.

మరి ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ వచ్చి మంచి రెస్పాన్స్ ని కూడా అందుకొనేసరికి మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఉన్న అసలైన ప్రోగ్రాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ చేశారు. వచ్చే అక్టోబర్ 8న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిక్స్ చెయ్యగా దీనికి అఖిల్ సోదరుడు అక్కినేని నాగచైతన్య స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

రీసెంట్ గానే చైతూ తన లవ్ స్టోరీ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ వంతు వచ్చింది. మరి అఖిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 15 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :