షూట్ మధ్యలో చేపల పులుసుతో ‘తండేల్’ రాజు ట్రీట్

షూట్ మధ్యలో చేపల పులుసుతో ‘తండేల్’ రాజు ట్రీట్

Published on Jan 17, 2025 10:00 PM IST

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్య ఎలా ఉంటాడనే విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియో రూపంలో వెల్లడించారు. చిత్ర యూనిట్ సభ్యులతో చైతూ ఎంతో కనెక్ట్ అయ్యి ఉంటాడని.. వారి కోసం ఏదైనా చేయడానికి ఆయన రెడీగా ఉంటాడని.. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో పట్టిన చేపలతో పులుసు పెట్టి మరీ యూనిట్ సభ్యులకు పెట్టాడని ఈ వీడియోలో చూపెట్టారు.

ఇక ఆయన స్వయంగా తన చేతులతో ఈ చేపల పులుసు పెట్టగా, అది ఎంతో రుచికరంగా ఉందని యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా ఈ సినిమాలో తండేల్ రాజు అనే పాత్రలో నాగచైతన్య సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూ్స్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు