క్రేజీ కాంబోలో నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్..?

Published on Feb 17, 2022 7:00 pm IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఇప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది లవ్ స్టోరీ, ఈ ఏడాది బంగార్రాజు లతో చైతు మంచి విజయాలు అందుకొని మరిన్ని ఆసక్తికర చిత్రాలు చేస్తున్నాడు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు చైతు నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్నట్టుగా ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. మరి ఈసారి చైతూ యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ సంకృత్యన్ తో అట. ఈ సౌండింగ్ బాగుందని చెప్పాలి.. అలాగే ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్యానర్స్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. రీసెంట్ గా రాహుల్ తెరకెక్కించిన శ్యామ్ సింగ రాయ్ ఎంత పెద్ద హిట్టయ్యి ఎలాంటి అప్లాజ్ ని అందుకుందో తెలిసిందే.. ఇక ఈ కాంబోలో సినిమా అంటే మరింత ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :