లేటెస్ట్ : నాగ చైతన్య ‘కస్టడీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ : నాగ చైతన్య ‘కస్టడీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 28, 2022 6:52 PM IST

యువ సామ్రాట్ నాగచైతన్య ఇటీవల విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరెక్కిన థాంక్యూ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. ఆ మూవీ మంచి విజయం అందుకున్న అనంతరం ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన చేస్తున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ తెలుగు, తమిళ బైలింగువల్ మూవీలో అరవింద్ స్వామి, సంపత్ రాజ్, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రియమణి వంటి వారు కీలక పాత్రలు చేస్తుండగా ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన కస్టడీ ఫస్ట్ లుక్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సమ్మర్ కానుకగా 2023 మే 12 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు