నాగచైతన్య ‘కస్టడీ’ టీజర్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Mar 15, 2023 5:00 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా దీనికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా ఈ మూవీ నుండి అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని మార్చి 16న సాయంత్రం 4 గం. 51 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. ప్రేమి విశ్వనాధ్, ప్రియమణి, అరవింద్ స్వామి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వేసవి కానుకగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :