‘లవ్ స్టోరీ’ విజయంపై చైతు ఎగ్జైటింగ్ పోస్ట్.!

Published on Sep 30, 2021 8:14 am IST


టాలీవుడ్ దగ్గర ఎప్పుడు నుంచో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “లవ్ స్టోరీ” అనే చెప్పాలి. అక్కినేని హీరో నాగ చైతన్య మరియు సాయి పల్లవి ల కాంబోలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం అనౌన్స్ చేసిన నాటి నుంచి విపరీతమైన పాజిటివ్ బజ్ తో ఆగుతూ అలా చాన్నాళ్ళకి గత వారం నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆల్రెడీ సాంగ్స్ హిట్టు, సినిమా కూడా నిరాశ పరచకుండా ఉండేసరికి తెలుగు ఆడియెన్స్ భారీ రెస్పాన్స్ ను వసూళ్ల రూపంలో అందించారు. దీనితో లాక్ డౌన్ 2.0 తర్వాత వచ్చిన సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. మరి ఇంతకీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు చైతు ఒక ఎగ్జైటింగ్ పోస్ట్ ని పెట్టాడు.

మొత్తం తన చిత్ర యూనిట్ తో లవ్ స్టోరీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఫోటో దిగి షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా “లైఫ్ టైం మెమొరీస్ ని ఇచ్చిన ఆడియెన్స్ కి లవ్ స్టోరీ టీం ధన్యవాదాలు తెలుపుతుంది” అని చైతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.

సంబంధిత సమాచారం :