బంగార్రాజు నుండి నేడు చైతన్య ఫస్ట్ లుక్ విడుదల

Published on Nov 22, 2021 11:24 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం నాగార్జున సూపర్ హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపు గా వస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి అక్కినేని నాగ చైతన్య కి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ లుక్ ను నేడు సాయంత్రం 5:22 గంటలకి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అంతేకాక ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను నవంబర్ 23 వ తేదీన 10:23 గంటలకు విడుదల చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :