స్టైలిష్ అండ్ డైనమిక్ గా నాగ చైతన్య… బంగార్రాజు నుండి ఫస్ట్ లుక్ విడుదల!

Published on Nov 22, 2021 8:23 pm IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం టీజర్ ను నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది.

నాగ చైతన్య డ్రెస్సింగ్ సూపర్ స్టైలిష్ గా ఉండగా, డైనమిక్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఎమోషనల్ మరియు రొమాన్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో బంగార్రాజు చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం లో రమ్య కృష్ణ, కృతి శెట్టి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :