నైట్ షూట్లో నాగ చైతన్య !

నైట్ షూట్లో నాగ చైతన్య !

Published on Nov 21, 2017 11:00 AM IST

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చైతన్యతో కలిసి ‘ప్రేమమ్’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ముగియగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతోంది.

ఈ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాల్ని నిన్న రాత్రి షూట్లో చిత్రీకరించారట యూనిట్. ఈ సినిమాలో నాగ చైతన్యను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చూపిస్తానాని చెబుతున్నారు దర్శకుడు చందూ మొండేటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు