చై కొత్త సినిమా బిగ్ అనౌన్స్ మెంట్ కి సర్వం సిద్ధం!

Published on Jun 22, 2022 9:28 pm IST

అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్న హీరో. లవ్ స్టోరీ చిత్రం తో టాలీవుడ్ లో భారీ హిట్ సాధించిన చైతూ, ప్రస్తుతం తన వరుస ప్రాజెక్టు ల పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రంతో బిజిగా ఉన్న ఈ హీరో, త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు నాగ చైతన్య కొత్త చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెంకట్ ప్రభు దర్శకత్వం లో నాగ చైతన్య ఒక చిత్రాన్ని చేయనున్నారు. దీని పై రేపు బిగ్ అనౌన్స్ మెంట్ ఉండనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 9:01 గంటలకు ఈ చిత్రం కి సంబంధించిన ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం :