నందిని రెడ్డి డైరక్షన్ లో నాగ చైతన్య?

Published on Mar 28, 2022 6:40 pm IST

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన రాబోయే చిత్రం థాంక్యూ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న పీరియాడికల్ డ్రామాలో నాగ చైతన్య కనిపించనున్నారు. ఇప్పుడు ఈ నటుడి తదుపరి చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం, దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన కథకు అక్కినేని హీరో ఓకే చెప్పాడని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ అవుట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. అయితే వెంకట్ ప్రభు సినిమా పూర్తయిన తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన తొలి వెబ్ సిరీస్ ధూత షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :