తమిళ డెబ్యూట్ పై నాగ చైతన్య అభిప్రాయం ఏమిటో తెలుసా !

naga-chaitanya1
టాలీవుడ్ యంగ్ హీరోల్లో అక్కినేని వారసుడు నాగ చైతన్య చేస్తున్నన్ని ప్రాజెక్టులు మరే హీరో చేయడం లేదు. ఇప్పటికే ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలు రెడీగా ఉండగానే కళ్యాణ్ కృష్ణతో ఒక ప్రాజెక్ట్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై కొత్త దర్శకుడితో మరో చిత్రం చేయనున్నాడు. అలాగే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తమిళ పరిశ్రమలోకి వెళ్లే ఆలోచనలేమన్నా ఉన్నాయా అని అడగ్గా చాలా ప్రాక్టికల్ సమాధానం చెప్పాడు చైతు.

ఆయన మాట్లాడుతూ ‘తమిళ పరిశ్రమ చాలా పెద్ద మార్కెట్. అక్కడ చాలా మంది టాలెంటెడ్ నటులున్నారు. అక్కడ మనకోసం రెడ్ కార్పెట్ పరిచి ఉండదు. సరైన టైమ్ లో సరైన స్క్రిప్ట్ చూసుకోవాలి’ అన్నారు. ఇకపోతే ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో ఈరోజు సాయన్తరం విడుదలవుతుండగా చిత్రం అక్టోబర్ 7న దసరా కానుకగా విడుదలకానుంది.