ఓటీటీలోకి నాగచైతన్య ఎంట్రీ.. వెబ్ సిరీస్లో జర్నలిస్ట్గా..!

Published on Jan 29, 2022 3:00 am IST

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో తండ్రి నాగార్జునతో కలిసి నటించి అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఓ పక్క బాలీవుడ్‌లో అమీర్ ఖాన్తో “లాల్ సింగ్ చద్దా” సినిమాలో చై నటించగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, దిల్‌రాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” చిత్ర షూటింగ్‌లో చై పాల్గొంటున్నాడు.

ఇదిలాఉంటే నాగచైతన్య ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్ తో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో నాగచైతన్య నెగెటివ్ షేడ్ ఉన్న జర్నలిస్ట్ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను నాగచైతన్య విభిన్నంగా మేకోవర్ అవ్వబోతున్నాడట. ఇకపోతే మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ను రూపొందించబోతున్నారని, ఒక్కో సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :