హిట్టైనా, ఫ్లాపైనా నన్ను సపోర్ట్ చేసింది అభిమానులే – నాగ చైతన్య

naga-chaitanya
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ఆడియో వేడుక నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. మళయాళ ‘ప్రేమమ్’ కు రీమేక్ గా తెరెకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ సందర్బంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ‘మళయాళ ఒరిజినల్ వెర్షన్ కు తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి ఈ సినిమా చేశాం. నేనెంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. తాతగారు మొదలుపెట్టిన ప్రయాణాన్ని నాన్నగారు కొనసాగించారు. అయన అభిమానులిచ్చిన సపోర్ట్ వలెనే ఇక్కడున్నాను’ అన్నారు.

అలాగే ‘ఇన్నాళ్లు సినిమాలు హిట్టైనా, ఫ్లాపైనా నన్ను సపోర్ట్ చేసింది అభిమానులే. ఆ అక్కినేని అభిమానులకు నా కృతజ్ఞతలు. చందూ మొండేటితో ఓ డైరెక్ట్ సినిమా చేయాలనుంది’ అన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన దాసరి మాట్లాడుతూ ‘ప్రేమ కథా చిత్రాలకు అక్కినేని కుటుంబం కేరాఫ్ అడ్రెస్ లాంటిది’ అన్నారు. ఇకపోతే శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి గోపి సుందర్, రాజేశ్ మురుగేశన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది.