‘రారండోయ్’ సినిమా చేయడానికి అసలు కారణాన్ని రివీల్ చేసిన నాగ చైతన్య !

24th, May 2017 - 11:39:48 AM


అక్కినేని హీరో నాగ చైతన్య చేసిన తాజా చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. రిలీజైన ట్రైలర్స్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటుండటంతో చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నెల 26నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన చైతన్య ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం చేయడం వెనుక గల అసలు కారణాన్ని బయటపెట్టాడు.

చైతన్య మాట్లాడుతూ ‘ సోగ్గాడే చిన్ని నాయన సినిమా చూశాకా ఇలాంటి చిత్రం ఒకటి చేయాలనిపించింది. ఆ సినిమాలో కళ్యాణ్ కృష్ణ నాన్న పాత్రను డిజైన్ చేసిన తీరు, స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంటాయి. నేనెప్పుడూ కమర్షియల్ సినిమాలే చేశాను. వాటికి రీచ్ కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే కమర్షియల్ సినిమానే వేరే విధంగా చేయాలనుకుంటుండగా కళ్యాణ్ కృష్ణతో ఈ కథతో ముందుకొచ్చాడు. కళ్యాణ్ హీరోల్లో మాస్ లుక్ తో పాటు క్లాస్ టచ్ కూడా ఉంటుంది. సినిమాను చాలా బాగా తయారుచేశాడు’ అంటూ ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కళ్యాణ్ కృష్ణ కమర్షియల్ సినిమాలకి ఇచ్చే డిఫరెంట్ ట్రీట్మెంటేనని తెలిపారు.