చైతూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి.!

Published on Oct 16, 2021 8:06 am IST

అక్కినేని టాలెంటెడ్ హీరో నాగ చైతన్య ఈ ఏడాది “లవ్ స్టోరీ” తన కెరీర్ లోనే పెద్ద హిట్ ను అందుకున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనల్ గా ఈ ఏడాది రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇంకా లైన్ లో ఉండగానే క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అలాగే అక్కినేని వారికి మరో ఆస్థాన దర్శకునిగా మారిన విక్రమ్ కె కుమార్ తో “థ్యాంక్ యు” చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసాడు.

అయితే ఈ చిత్రం కూడా స్టార్ట్ అయ్యి పెద్దగా బ్రేక్స్ లేకుండానే శరవేగంగా కంప్లీట్ అయ్యింది. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనిని ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ తెలిపారు. దర్శకుడు విక్రమ్ చిరు నవ్వే మొత్తం చెబుతుంది అని తెలిపారు. మరి ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :