చైతూ నెక్స్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్.!

చైతూ నెక్స్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్.!

Published on Nov 23, 2022 10:41 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరోస్ లో అక్కినేని వారి యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. మరి ఎలాంటి రోల్ లో అయినా కూడా పర్ఫెక్ట్ గా సూటయ్యే చైతు బర్త్ డే ఈరోజు కావడంతో అభిమానులు చై కి ఈరోజు బర్త్ డే విషెస్ అయితే తెలియజేస్తున్నారు. ఇక తాను నటిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి అయితే మేకర్స్ నిన్ననే మంచి ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యగా అది మంచి బజ్ ని రేకెత్తించింది.

ఇక ఇదిలా ఉండగా ఈరోజు అయితే మేకర్స్ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమాకి “కస్టడీ” అనే ఆసక్తికర టైటిల్ ని పెట్టినట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి ఈ పోస్టర్ లో అయితే పోలీస్ గెటప్ లో చైతు మంచి ఇంటెన్స్ గా కనిపిస్తుండగా తన చుట్టూ ఉన్న ఇతర పోలీసులు గన్స్ తో అతన్ని చుట్టముట్టడం మరింత ఆసక్తికొల్పుతుంది.

ఇక ఈ చిత్రాన్ని అయితే తమిళ్ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో తెరకెక్కుతుంది. అలాగే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా కృతి శెట్టి అయితే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అరవింద స్వామి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు