అదేనా నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ ఇన్విటేషన్ ?


టాలీవుడ్లోనే కాక దక్షిణాదిన కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ట్రెండవుతున్న విషయం నాగ చైతన్య, సమంతల ప్రేమ, పెళ్లి వ్యవహారం. చాలా మంది సినీ ప్రియులు వీరి వివాహ మహోత్సవం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరి వివాహా ఆహ్వాన పత్రిక అంటూ ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆన్ లైన్లో తెగ హడావుడి చేస్తోంది.

ఆ పత్రికలో వివాహం అక్టోబర్ 7వ తేదీన గోవాలోని వాఘటోర్ బీచిలోని బీచ్ లోని డెబ్ల్యూ హోటల్ లో జరుగుతుందని, అంతకు ముందు అక్టోబర్ 6న ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా అక్కడే జరుగుతుందని ఉంది. మరి ఈ పత్రిక వాస్తవమైనదో కాదో తెలియాలంటే అక్కినేని కుటుంబం నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.