నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వవంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా జులైలో ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుటుంది. కాగా చైతు, సమంత ఈ నెల రెండో వారంలో షూటింగ్ లో పాల్గొంటారట. అయితే గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
కాగా ఈ చిత్రం టైటిల్ ‘మజిలి’ అంటూ గతంలోనే సోషల్ మీడియాలో ఆ టైటిల్ హల్చల్ చేసింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పటికే మజిలీ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కనుంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
