“తండేల్” పై నాగ చైతన్య సాలిడ్ కాన్ఫిడెన్స్!

“తండేల్” పై నాగ చైతన్య సాలిడ్ కాన్ఫిడెన్స్!

Published on Feb 6, 2025 12:02 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “తండేల్”. యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ భారీ సినిమా మంచి బజ్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి మంచి కాన్ఫిడెన్స్ గా ఉండగా నాగ చైతన్య కాన్ఫిడెన్స్ కూడా ఈ సినిమా విషయంలో ముచ్చటేస్తుంది అని చెప్పాలి.

ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే తన సినిమా సక్సెస్ మీట్ ని శ్రీకాకుళంలో చేస్తామని తెలిపాడు. దీనితో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని తాను ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు నిర్మాణం వహించగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు