నిజంగా ‘బంగార్రాజు’ పండగలాంటి సినిమా. – నాగ చైతన్య

Published on Jan 10, 2022 9:00 am IST

అక్కినేని నాగార్జున తన తనయుడు నాగ చైతన్యతో కలిసి చేసిన సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆదివారం ‘బంగార్రాజు’ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘మనం’ సినిమాకి ఇలాంటి వేడుక నిర్వహించాం. మళ్లీ ఇన్నేళ్లకు ‘బంగార్రాజు’ సినిమాకు నిర్వహించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆడియోను పెద్ద హిట్‌ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్‌.

అనూప్‌ ఈ సినిమాకు అన్నీ అద్భుతమైన పాటలు అదించాడు. పైగా అన్నపూర్ణ స్టూడియో సంస్థలో అనూప్‌ పనిచేసిన ప్రతి సినిమా సక్సెస్ సాధించింది. అందుకే ‘బంగార్రాజు’ కూడా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని నమ్ముతున్నాను. నిజంగా ఇది పండగలాంటి సినిమా. ఇందులో నాకు బంగారంలాంటి క్యారెక్టర్‌ ఇచ్చిన దర్శకుడికి, అలాగే మా నాన్నకి చాలా థ్యాంక్స్‌. ఈ చిన్న బంగార్రాజు పాత్రతో అభిమానులతో పాటు ప్రేక్షకులకి కూడా మరింతగా దగ్గరవుతాను’ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :