“థ్యాంక్యూ” మూవీ ఫస్ట్ సింగిల్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jun 9, 2022 12:00 am IST

అక్కినేని నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “థ్యాంక్యూ”. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 8న ఈ చిత్రం విడుదల కానుండడంతో మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్‌ని మొదలు పెట్టేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ “మారో మారో” సాంగ్ విడుదలకి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ఈ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికా గోర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :