రొమాంటిక్ షూట్ మోడ్‌లో నాగచైతన్య “థ్యాంక్యూ”..!

Published on Jan 29, 2022 2:00 am IST

నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “థ్యాంక్యూ”. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్‌ని జరుపుకుంటుంది. రష్యాలోని మాస్కోలో రాశి ఖన్నా మరియు చైతన్య అక్కినేనిపై మేకర్స్ కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే త్వరలో పూర్తి కానున్న ఈ షెడ్యూల్‌లో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొనబోతున్నాడట. ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికా గోర్‌లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, వేసవిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుందట.

సంబంధిత సమాచారం :