మెగాస్టార్ చిరంజీవి, అమీర్ ఖాన్ లకు నాగ చైతన్య స్పెషల్ థాంక్స్!

Published on Sep 20, 2021 6:00 pm IST

నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కి దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ మేరకు నిన్న లవ్ స్టోరీ అన్ ప్లగ్డ్ అంటూ ప్రీ రిలీజ్ వేడుక కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేడుక కు బాలివుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ పై, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను వేడుక లో ప్రస్తావించారు. అదే తరహాలో అమీర్ ఖాన్ లవ్ స్టోరీ టీమ్ పై, సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అమీర్ ఖాన్ లు ఈ వేడుక కు హాజరు అయ్యి, ఇంత సక్సెస్ సాధించడం పట్ల థాంక్స్ తెలిపారు నాగ చైతన్య. అంతేకాక వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఎంతగానో కదిలించాయి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :