నాగచైతన్య ‘థాంక్యూ’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Published on Jul 11, 2022 9:00 pm IST

అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీలో నాగచైతన్య, అభి అనే రోల్ చేస్తుండగా ఆయనకి జోడీగా రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి క్రేజ్ ఏర్పరిచాయి. మనం తరువాత చైతు, విక్రమ్ ల కాంబోలో వస్తున్న ఈ మూవీ తప్పకుండా పెద్ద సక్సెస్ కొడుతుందని అంటోంది యూనిట్. ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రేపు సాయంత్రం 06 గం.03 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీలో చైతు క్యారెక్టర్ యూత్ ని ఆకట్టుకోనుందట. ఇక ఈ మూవీని ఈనెల 22న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :