ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న నాగ చైతన్య

Naga-Chaitanya

అక్కినేని నాగ చైతన్య తరువాతి సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుది. ఇందులో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈమెతో పాటు మరో హీరోయిన్ తో కూడా చైతు రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు వరుస హిట్లతో యంగ్ హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారిన లావణ్యా త్రిపాఠి అట.

లావణ్య ఇప్పటికే ‘భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు’ వంటి విజయాలతో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఉండబోతోందని వినికిడి. అలాగే ఈ చిత్రానికి ‘ఒకసారి ఇటు చూడవే’ అనే క్రేజీ టైటిల్ ను కూడా లాక్ చేశారట. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక సమాచారం అందలేదు. ఇకపోతే నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ అక్టోబర్ 7న విడుదలకానుండగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన మరో చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడ విడుదలకు సిద్ధంగా ఉంది.