విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య !

దర్శకుడు విక్రమ్ కె. కుమార్ రూపొందించే సినిమాలు రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటాయి. ‘ఇష్క్, 24, మనం’ సినిమాలు దేనికదే డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా ఈ డైరెక్టర్ అఖిల్ తో ‘హలో’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘హలో’ ట్రైలర్ చూస్తుంటే సినిమా పాజిటివ్ గా ఉండబోతుందేమో అనిపిస్తోంది.

తాజాగా నాగార్జున ‘హలో’ సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్రమ్ కుమార్ నాగ చైతన్య ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడని చెప్పాడు. కానీ ప్రస్తుతం ‘హలో’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ ఈ సినిమా విడుదల తరువాత మరో సినిమా వేరే హీరోతో చెయ్యబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ తరువాత చైతు మూవీ ఉంటుందని తెలిపారు.