నిర్మాతగా మారుతానంటున్న నాగ చైతన్య !

21st, May 2017 - 04:14:10 PM


‘ ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే చిత్రంతో త్వరలో మన ముందుకురానున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆయన త్వరలోనే నిర్మాతగా మారాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు.

గతంలో ‘ఒక లైలా కోసం’ నిర్మాణ బాధ్యతల్ని చూసుకున్న ఆయన తనలో సినిమాల్ని నిర్మించాలనే ఆలోచన బలంగా ఉందని అందుకు తన తండ్రి సపోర్ట్ కూడా ఉందంటూ ‘నాన్న నీకు నచ్చిన కథని నా వద్దకు తీసుకురా బాగుందనిపిస్తే చేద్దాం అన్నారు. అన్నీ కుదిరి మంచి కథ వస్తే త్వరలోనే నా నిర్మాణంలో సినిమా మొదలవుతుంది’ అన్నారు. ఇకపోతే మే 26న రిలీజ్ కానున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర ఆడియో వేడుక ఈరోజు సాయంత్రం జరగనుంది.